మిమ్మల్ని ఫస్టు టైమ్ మెట్రోలో చూశాను పూజ గారు!: 'దేవదాస్'లో రష్మిక లుక్ పై నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మిమ్మల్ని ఫస్టు టైమ్ మెట్రోలో చూశాను పూజ గారు!: 'దేవదాస్'లో రష్మిక లుక్ పై నాని

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా 'దేవదాస్'
  • నాని జోడీగా రష్మిక మందన 
  • ఈ నెల 27వ తేదీన విడుదల
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' సినిమా రూపొందింది. నాగార్జున .. నాని కథానాయకులుగా ఈ సినిమా నిర్మితమైంది. డాన్ గా నాగార్జున .. డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన అలరించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక మందన లుక్ ను రిలీజ్ చేశారు. పూజ పాత్రలో రష్మికను పరిచయం చేస్తూ .. ఆమె లుక్ ను నాని రిలీజ్ చేశాడు. 'ఫస్టు టైమ్ మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్ అయింది పూజ గారు .. మళ్లీ ఎప్పుడు?' అంటూ సినిమాలో తన పాత్ర పరంగా నాని ట్వీట్ చేశాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమా తమకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే బలమైన నమ్మకంతో నాగార్జున .. నాని వున్నారు.
nag
nani
rashmika

More Telugu News