మైనర్ బాలికపై యువకుడి లైంగిక దాడి: పొలాల్లోకి తీసుకువెళ్లి బలవంతం
- బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని
- ప్రేమ పేరుతో వెంట పడుతున్న నిందితుడు
- సిద్ధిపేటలో ఇటీవల జరిగిన ఘటన
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజు (25) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాధిత బాలిక బోనాలకు సిద్ధిపేటలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రాజు ఆ ఊరెళ్ళాడు. ఎవరూ లేని సమయంలో బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది తెలిసిన బాలిక తల్లిదండ్రులు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.