మరో మూడు రోజుల్లో అంధకారంగా మారనున్న తమిళనాడు.. ఆదుకోవాలంటూ మోదీకి పళని లేఖ
- రాష్ట్రంలో మూడు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
- రోజుకు 72 వేల టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సిందిగా వేడుకోలు
- లేదంటే రాష్ట్రంలో అంధకారం తప్పదన్న పళని
రాష్ట్రానికి రోజుకు సగటున 20 వేగన్ల బొగ్గు అవసరం కాగా, ప్రస్తుతం 7 నుంచి 8 వేగన్ల బొగ్గు మాత్రమే సరఫరా అవుతోందని పళనిస్వామి పేర్కొన్నారు. ఈ నెల రెండో వారం తర్వాత సీజన్ ముగియనుండడంతో గాలి విద్యుత్ యంత్రాలను కూడా మూసుకోవాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా బొగ్గును సరఫరా చేసి ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.