Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను హీరోగా పెట్టుకోవద్దని నా ముందే చెప్పినవాళ్లున్నారు: యాక్షన్ కింగ్ అర్జున్

  • మంచి .. చెడూ ప్రతిచోటా ఉంటాయి 
  • నన్ను కొంతమంది హర్ట్ చేశారు 
  • వాళ్లకి కూడా నేను వర్క్ ఇచ్చాను
మా పల్లెలో గోపాలుడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అర్జున్, ఆ తరువాత పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు.

"మంచి .. చెడూ అనేవి అప్పుడు .. ఇప్పుడూ .. ఎప్పుడూ ఉంటాయి. చెడును పట్టించుకుంటూ కూర్చుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. తెలిసో .. తెలియకో మొదటి నుంచి నేను చెడ్డవాళ్లను దూరం పెడుతూ వచ్చాను. నేను కర్ణాటక ప్రాంతానికి చెందినవాణ్ణి కావడంతో, వీడినెందుకు హీరోగా పెట్టుకున్నారని కొంతమంది నా కళ్లముందే అనేవారు. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేవాడిని. కాలక్రమంలో నేను హీరోగా .. దర్శక నిర్మాతగా ఎదిగాను. నా గురించి అలా అన్నవాళ్లందరినీ పిలిచి వర్క్ ఇచ్చాను .. అదే నేను సాధించిన సక్సెస్ గా భావిస్తాను" అని ఆయన చెప్పుకొచ్చారు.      
arjun

More Telugu News