Rajasingh: అనుమతి లేకుండా ర్యాలీ.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు

  • గత నెల 15న అనుమతి లేకుండా ర్యాలీ
  • 41ఎ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు
  • 17న హాజరుకావాలంటూ ఆదేశాలు

హైదరాబాద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే రాజాసింగ్ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన ఆయన ఇకపై తన జీవితాన్ని గోసేవకు అంకితం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, గోవధకు పాల్పడే వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు.

గత నెల 15న ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై అబిడ్స్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. 41ఎ సీఆర్‌పీసీ కింద రాజాసింగ్‌కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఆయన ఎ6 ముద్దాయిగా ఉన్నారు. ఈ నెల 17న పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.   

Rajasingh
Goshamahal
Hyderabad
BJP
MLA
Abids
  • Loading...

More Telugu News