కేసీఆర్, కేటీఆర్ లపై గద్దర్, విమలక్క పోటీ చేస్తారు!: కంచ ఐలయ్య ప్రకటన
- తెలంగాణకు గద్దర్, విమలక్క అసలైన వారసులు
- వీరి గెలుపుకు మిగతా పార్టీలు సహకరించాలి
- ఏ త్యాగం చేయని కేటీఆర్ సీఎం కావాలనుకుంటున్నారు
ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ పై ఐలయ్య విమర్శలు గుప్పించారు. రాష్ట్రం కోసం ఎలాంటి త్యాగం చేయని కేటీఆర్... ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని విమర్శించారు. గద్దర్, విమలక్కలను గెలిపించేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కృషి చేయాలని విన్నవించారు. వీరిద్దరిపై కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలు పోటీ పెట్టకూడదని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వినతిపత్రం ఇస్తామని చెప్పారు.