చెన్నూరు టికెట్ వ్యవహారం.. ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య ఆరోగ్యం విషమం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నూరు టికెట్ వ్యవహారం.. ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య ఆరోగ్యం విషమం!

  • యశోదా ఆసుపత్రిలో చికిత్స
  • మరో ఐదుగురి పరిస్థితి తీవ్రం
  • నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య
చెన్నూరు అసెంబ్లీ టికెట్ ను టీఆర్ఎస్ అధిష్ఠానం బాల్క సుమన్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గట్టయ్య అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న గట్టయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గట్టయ్యతో పాటు మంటలు అంటుకున్న మరో ఐదుగురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాల్కసుమన్ కు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో మరో 16 మందికి మంటలు అంటుకున్నాయి. అయితే వీరిలో గట్టయ్య సహా ఆరుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితులను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పోలీసులే చొరవ తీసుకుని వీరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరిని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు.
chennur
suicide
Mancherial District

More Telugu News