నివాస భవనాల్ని నిర్మించే క్రమంలో దొరికిన బంగారు నాణేల పాత్ర!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నివాస భవనాల్ని నిర్మించే క్రమంలో దొరికిన బంగారు నాణేల పాత్ర!

  • ఇటలీలో వందలాది బంగారు నాణేలు లభ్యం
  • బేస్‌మెంట్ పనుల్లో భాగంగా లభ్యమైన బంగారు నాణేల పాత్ర
  • ఫేస్‌బుక్‌లో వెల్లడించిన ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
పాత థియేటర్ కూల్చేసి కొత్తగా నివాస భవనాల్ని నిర్మించే క్రమంలో కళ్లు చెదిరిపోయే సంపద లభించింది. ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసింది.

ఉత్తర ఇటలీలోని ఓ ప్రాంతంలో ఉన్న పాత థియేటర్‌ను కూల్చేసి కొత్తగా నివాస భవనాల్ని నిర్మించాలని దాని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా పునాది తీయడం ప్రారంభించింది. పనులు కొనసాగుతుండగా రాతిపాత్ర కనిపించింది. దానిని తీసి చూడగా వందల సంఖ్యలో పురాతన రోమన్ బంగారు నాణెలు లభ్యమయ్యాయి. ఈ విషయమై స్పందించిన సాంస్క‌‌ృతిక శాఖా మంత్రి అల్బెర్టో బొనిసొలి ఆ ప్రాంతం పురాతత్వానికి అసలైన నిధి అని.. బంగారు నాణేల చారిత్రక ప్రాముఖ్యత తెలుసుకోవాల్సి వుందని అన్నారు.
gold coins
italy
old theatre

More Telugu News