రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేయాలని తమిళనాడు మంత్రి వర్గం నిర్ణయం
- సీఎం పళనిస్వామి నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం
- శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు విడుదలకు నిర్ణయం
- గవర్నర్ కు తెలియజేయనున్న మంత్రి వర్గ నిర్ణయం
కాగా, 1991 మేలో ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం రాజీవ్ గాంధీని మానవబాంబుతో పొట్టనబెట్టుకుంది. రాజీవ్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు నళిని సహా ఏడుగురు నిందితులు 27 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. గవర్నర్ క్షమాభిక్ష కింద తనను విడుదల చేయాలని మద్రాసు హైకోర్టును ఆమె గతంలో ఆశ్రయించింది.