వైసీపీ నేతలు చాలా మంది టీడీపీతో టచ్ లో ఉన్నారు: మంత్రి గంటా

  • జగన్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు
  • అందుకే, మా పార్టీతో టచ్ లో ఉన్నారు
  • మాజీ డీజీపీ భేటీనీ రాజకీయంగా వాడుకున్నారు!
చాలా మంది వైసీపీ నేతలు టీడీపీతో టచ్ లో ఉన్నారని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విశాఖపట్టణంలో కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, జగన్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారని, అందుకే, తమ పార్టీతో టచ్ లో ఉన్నారని అన్నారు. మాజీ డీజీపీ సాంబశివరావు జగన్ ని ఇటీవల కలిసిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సాంబశివరావు మర్యాదపూర్వక భేటీని కూడా రాజకీయంగా వాడుకున్నారని, భవిష్యత్ లో వైసీపీకి ప్రస్తుతం ఉన్న సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు.

YSRCP
Telugudesam
ganta

More Telugu News