వారం రోజుల్లోగా పరిస్థితి మెరుగుపడాలి.. లేదంటే సస్పెండ్ చేస్తా!: విశాఖ అధికారులకు చంద్రబాబు వార్నింగ్
- అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్
- విషజ్వరాల విజృంభణపై ఆగ్రహం
- విశాఖలో వచ్చి కూర్చుంటానని వ్యాఖ్య
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అంటువ్యాధులు లేవనీ, ఒక్క విశాఖపట్నంలో మాత్రమే అంటు వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. హుద్ హుద్ తుపాను సమయంలో ఉన్నట్లే తాను ఇప్పుడు కూడా వైజాగ్ కు వచ్చి అధికారులు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ అధికారులు సెలవు రద్దు చేసుకోవాలన్నారు. ప్రజలకు అంటు వ్యాధులపై అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు.