వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్త.. ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య!

08-09-2018 Sat 09:53 | Andhra
  • కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘటన
  • అక్రమ సంబంధంపై భర్త నిలదీత
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు
వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బలికొంది. భార్య అక్రమ సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో ఆగ్రహానికి లోనైన ఆమె ప్రియుడితో కలిసి కట్టుకున్నవాడిని దారుణంగా హత్య చేసింది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం బోయినపల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బోయినపల్లికి చెందిన శివరాములు లక్ష్మీదేవిని 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాదాపు నెల రోజుల క్రితం కుమార్తెకు వివాహం చేశారు. అయితే ఇదే గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తితో లక్ష్మీదేవికి ఏడేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో అల్లుడు, కుమార్తె ఇంటికి వచ్చారు. కాగా, వివాహేతర సంబంధంపై గురువారం రాత్రి శివరాములు, లక్ష్మీదేవిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం ఇంటిబయట అరుగుపై శివరాములు నిద్రపోగా, రామకృష్ణ, లక్ష్మీదేవి కలిసి వేటకొడవళ్లతో మెడపై నరికి హత్యచేశారు. అనంతరం అతనిని ఇంటిపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేశారు. మిద్దె పై నుంచి పడిపోయి శివరాములు చనిపోయినట్లు అందరినీ నమ్మించారు.

అయితే ఇంటిపై మట్టి ఉండటం, శివరాములు మెడ భాగంలో గాయాలు ఉండటాన్ని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అక్కడ ఇది పక్కా హత్య అని తేలడంతో పోలీసులు వీరిద్దరినీ ప్రశ్నించారు. దీంతో తామే శివరాములును హత్యచేశామని ఇద్దరూ ఒప్పుకున్నారు. వీరిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు.
Kurnool Districtextra martial affairAndhra Pradesh

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more