సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

08-09-2018 Sat 08:06 | National
  • తనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రామ్ కదమ్
  • ట్రోల్ చేసిన నెటిజన్లు
  • క్షమాపణలు చెప్పిన వివాదాస్పద ఎమ్మెల్యే
మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా మరోమారు చిక్కుల్లో పడ్డారు. కేన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కన్నుమూసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తనకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసిన ఆయన దానిని యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తూ ఆటాడుకున్నారు.

ఎమ్మెల్యేకు వచ్చిన వాట్సాప్‌ మెసేజ్‌లో.. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని రాసుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన రామ్ కదమ్.. ఆ మెసేజ్‌లోని సమాచారాన్ని నిర్ధారించుకోకుండా యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడడంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

తాను మెటాస్టాటిక్ కేన్సర్ బారిన పడినట్టు సోనాలి బింద్రే జూలై 4న వెల్లడించడంతో హిందీ చిత్రపరిశ్రమ సహా అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స పొందుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటోంది. కాగా, తాజా వివాదంపై రామ్ కదమ్ స్పందిస్తూ.. తాను క్షమాపణలు చెప్పానని, దీంతో ఈ వివాదం సమసిపోయిందని పేర్కొన్నారు.
sonali BendreCancerRam KadamBJPMaharashtra

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more