'2.ఓ' టీజర్ రిలీజ్ డేట్ చెప్పేసిన శంకర్
- శంకర్ దర్శకత్వంలో '2.ఓ'
- రజనీ అభిమానుల వెయిటింగ్
- ఈ నెల 13వ తేదీన టీజర్ విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను శంకర్ ఎనౌన్స్ చేశాడు. 'వినాయకచవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టు చెప్పాడు. రజనీ అభిమానులందరికీ ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ టీజర్ తో శంకర్ ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాలి. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, కథానాయికగా ఎమీ జాక్సన్ నటించిన సంగతి తెలిసిందే.