టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి.. ప్రకటించిన కేటీఆర్!

07-09-2018 Fri 13:01 | Telangana
  • పార్టీలో ఆయన స్థాయికి తగ్గ గౌరవమిస్తాం
  • కేసీఆర్ తో ఆయనది 29 ఏళ్ల అనుబంధం
  • మీడియా సమావేశంలో కేటీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సురేశ్ రెడ్డికి కేసీఆర్ తో 1989 నుంచి పరిచయం ఉందని కేటీఆర్ తెలిపారు. వేర్వేరు రాజకీయ పార్టీల్లో పనిచేసినప్పటికీ, ఆలోచనలు వేరైనప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఇద్దరికీ భావసారూప్యత ఉండేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కలసి పనిచేద్దామని కేసీఆర్ పంపిన ఆహ్వానాన్ని సురేశ్ రెడ్డి మన్నించారని పేర్కొన్నారు. సురేశ్ రెడ్డిని ఆహ్వానించడానికి తాను, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో కలసి ఆయన నివాసానికి వచ్చినట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ రోజు సురేశ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేశ్ రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. సురేశ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా పనిచేశారనీ, టీఆర్ఎస్ లో ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సురేశ్ రెడ్డితో పాటు వందలాది మంది ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరుతారని ప్రకటించారు. తమ ఆహ్వానాన్ని మన్నించినందుకు కేటీఆర్ సురేశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో బాల్కొండలో కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసిన సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తాజాగా బాల్కొండ పార్టీ టికెట్ ను ప్రశాంత్ రెడ్డికి టీఆర్ఎస్ అధిష్ఠానం ఇచ్చిన నేపథ్యంలో సురేశ్ రెడ్డికి భవిష్యత్తులో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
TRSCongressAndhra Pradeshassemblysuresh reddyex speaker

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more