అమెరికాలోని దుండగుడి కాల్పులు.. తెలుగు యువకుడు దుర్మరణం!
- ఓహియో రాష్ట్రంలో దుండగుడి కాల్పులు
- నిందితుడి కాల్పుల్లో ముగ్గురి దుర్మరణం
- ఎదురు కాల్పుల్లో హతమార్చిన పోలీసులు
ఫౌంటైన్ స్వ్కేర్ లోని ఫిఫ్త్ థర్డ్ సెంటర్ భవనం లాబీలో జరిగిన ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట వాసి కందేపి పృథ్వీరాజ్(26) ప్రాణాలు కోల్పోయాడు. ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని ఒమర్ ఎన్రిక్ శాంటా(29)గా అధికారులు గుర్తించారు. ఇతని వద్ద 200 రౌండ్లకు సరిపడా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అమెరికా అధికారులతో కుటుంబ సభ్యులు చర్చిస్తున్నారు. కాగా, ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో పృథ్వీరాజ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.