కొండా సురేఖకు హ్యాండ్ ఇచ్చిన కేసీఆర్!

06-09-2018 Thu 17:16 | Telangana
  • టీఆర్ఎస్ తొలి జాబితాలో కనిపించని కొండా సురేఖ పేరు
  • పెండింగ్ లో ఉంచిన కేసీఆర్
  • మధుసూదనాచారి, నన్నపునేని నరేందర్ తో విభేదాల పట్ల కేసీఆర్ సీరియస్
మాజీ మంత్రి కొండా సురేఖకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈరోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్... కొండా సురేఖ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సురేఖ 2014లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి గెలుపొందారు.

కొండా సురేఖ పేరును కేసీఆర్ పెండింగ్ లో ఉంచడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ తో కొండా సురేఖ, భర్త మురళికి విభేదాలు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సైతాన్ దాపురించిందంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీంతో, నరేందర్ పై కొండా సురేఖ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు కొత్తగా మీసాలు మెలేస్తున్నారని, ఉన్న వెంట్రకలు ఊడటం తప్ప మరే ఉపయోగం ఉండదంటూ హెచ్చరించారు.

మరోవైపు మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లిపై కూడా సురేఖ దృష్టి సారించారు. తన కుమార్తె సుస్మితా పటేల్ కు భూపాలపల్లిని కేటాయించాలని ఆమె ఆశించారు. ఈ క్రమంలో మధుసూదనాచారి వర్గీయులతో బహిరంగంగానే ఘర్షణకు దిగారు. ఈ వివాదాలన్నింటి నేపథ్యంలో, కొండా దంపతులపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ కారణంగానే వరంగల్ తూర్పు సీటును ప్రకటించకుండా ఆయన పెండింగ్ లో ఉంచారు. 
Konda Surekhakcrwarangal eastticketpending

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more