టికెట్ అడిగితే ఎన్ని కోట్లు వున్నాయని అడుగుతున్నారు!: మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు!
- ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకరు రూ.20 కోట్లు ఖర్చు చేసి గెలిచారు
- ఆ డబ్బు కోసం అవినీతికి పాల్పడకపోతే భార్య కూడా నిలదీస్తుంది
- కోట్లు ఉంటేనే కొన్ని పార్టీలు టికెట్ ఇస్తున్నాయి
ప్రస్తుతం కొన్ని పార్టీల్లో విలువలు పాటించడం లేదని, డబ్బులుంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే స్థాయికి దిగజారాయని, విలువలకు గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాను 1983లో కాకినాడలో డిగ్రీ చేసి నర్సీపట్నం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు ఫోన్లోనే చెప్పారని గుర్తు చేశారు. అప్పట్లో వ్యక్తులకు, విలువలకు అంత ప్రాధాన్యం ఉండేదన్నారు. ఏదైనా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తే తొలుత ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.