రవిశాస్త్రి గురించి షాకింగ్ న్యూస్.. రెండేళ్లుగా నటి నిమ్రత్‌కౌర్‌తో ప్రేమయాణం!
- తన కంటే 20 ఏళ్లు చిన్నదైన నటితో ప్రేమ
- మూడో కంటికి తెలియకుండా వ్యవహారం
- టీమిండియా-బాలీవుడ్‌లో హాట్ టాపిక్
2015లో ఓ కంపెనీ కార్ల లాంచింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన ఎయిర్‌లిఫ్ట్ మూవీతో నిమ్రత్ కౌర్ పేరు బాలీవుడ్‌లో మార్మోగింది. ప్రస్తుతం నిమ్రత్ ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉండగా, రవి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. కాగా, 1980లలో టీమిండియాలో స్టార్ ఆటగాడిగా ఉన్న రవిశాస్త్రి బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో డేటింగ్ చేశాడు. అయితే, వీరి ఇన్నింగ్స్ కొంతకాలానికే ముగిసింది.