రామారావుగారికి కోపం వస్తోంది .. హరికృష్ణ వచ్చి గబగబా నన్ను బయటికి తీసుకెళ్లాడు: పరుచూరి గోపాలకృష్ణ

03-09-2018 Mon 12:29 | Entertainment
  • 'చండశాసనుడు' స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి 
  • ఈ సినిమాకి దర్శకుడు రామారావుగారే 
  • ఆయన మాటలకు మధ్యలో నేను అడ్డు తగిలాను     
ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలకి పరుచూరి గోపాలకృష్ణ పనిచేశారు. తాజాగా ఆయన తనకి .. హరికృష్ణకు సంబంధించిన కొన్ని సంఘటనలను గురించి చెప్పుకొచ్చారు. మద్రాసులో 'చండశాసనుడు' సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కూర్చున్నాం. అన్నగారు .. నేను మాట్లాడుకుంటూ ఉండగా, గుమ్మం దగ్గరే హరికృష్ణ నుంచుని వున్నారు. స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ అన్నగారు చెప్పినదానికి సమాధానంగా, 'అలాగైతే బాగోదండి .. కరెక్ట్ కాదు' అని ఎమోషనల్ గా చెప్పాను.

దాంతో రామారావుగారికి కోపం వచ్చేస్తోంది .. అది గమనించిన హరికృష్ణ గబగబా నా దగ్గరికి వచ్చి నా రెక్క పట్టుకుని బయటికి తీసుకెళ్లాడు. ' ప.గో' ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా .. ఎన్టీ రామారావుగారితో మాట్లాడుతున్నావ్' అన్నాడు. 'నిజమే నాన్నా .. ఎన్టీఆర్ గారు నాకు దైవం .. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఆయనతో కాదు .. ఈ సినిమా దర్శకుడితో. ఆయన ఈ సినిమాకి డైరెక్టర్ గనుక ఒక రైటర్ గా నా భావం చెబుతున్నాను' అన్నాను. 'ఏవైనా ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకో .. ఆయన ముందు వాయిస్ ఒక స్థాయిని దాటి వెళ్లడానికి లేదు' అన్నాడు. ఆ తరువాత నుంచి ఆయన నాకు మరింత ఆత్మీయుడు అయ్యాడు' అని చెప్పుకొచ్చారు.          
paruchuriharikrishna

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more