: ఆధార్ పూర్తయ్యాకే పథకాల అనుసంధానం: మంత్రి శ్రీధర్ బాబు
ఆధార్ నమోదు కార్యక్రమం మొత్తం పూర్తయ్యాకనే, సంక్షేమ పథకాల అనుసంధానం చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి తెలిపారు. ఇందుకోసం కొత్తగా 19వందల ఆధార్ కేంద్రాలను ప్రారంభిస్తామని మంత్రి హైదరాబాదులో చెప్పారు. ఈ నెల 18 నుంచి ‘ఆధార్ పరిష్కార్’ పేరిట కార్డులు పొందవచ్చునని తెలిపారు. ఆధార్ కు గ్యాస్ ను అనుసంధానం చేస్తూ, గడువును పెంచాలని కేంద్రం చమురు సంస్థలకు ఆదేశాలు పంపిన నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేశారు.