Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టలేను: బీజేపీ ఎంపీ అభ్యర్థి, నటి కంగనా రనౌత్

  • లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతానని వెల్లడి
  • ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో ఇండస్ట్రీని వీడలేనని స్పష్టత
  • కంగనా వ్యాఖ్యలతో మండి లోక్‌సభ స్థానంలో ఫలితంపై ఉత్కంఠ
Kangana Ranaut on working in Bollywood post Lok Sabha polls

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు. తన సినిమాలు చాలా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని వ్యాఖ్యానించారు.

ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కంగనా చేసిన తాజా వ్యాఖ్యలు మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి. కాగా కంగనా రనౌత్ చివరిగా ‘తేజస్‌’ సినిమాలో కనిపించింది. మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.

కాగా మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆ స్థానంలో వ్యూహాత్మకంగా కంగనా రనౌత్‌ని బీజేపీ రంగంలోకి దింపింది. తాజా వ్యాఖ్యలతో కంగనకు గట్టి సవాలు ఎదురవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు 7వ దశలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. జూన్ 1న 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో ఆ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News