'మణికర్ణిక' నుంచి తప్పుకున్న సోనూసూద్

01-09-2018 Sat 10:20 | Entertainment
  • షూటింగు దశలో మణికర్ణిక
  • ఇప్పటికే ప్రాజెక్టు నుంచి తప్పుకున్న క్రిష్ 
  • అసంతృప్తికి లోనైన సోనూ సూద్   
సోనూ సూద్ గురించి తెలిసినవాళ్లు ఆయన చాలా కమిట్ మెంట్ వున్న వ్యక్తి అని చెబుతారు. ఒకసారి ఒక ప్రాజెక్టు చేయడానికి అంగీకరిస్తే, తన వలన ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటి సోనూ సూద్ హఠాత్తుగా 'మణికర్ణిక' సినిమా నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 ఓపక్క, ఇప్పటికే కంగనా రనౌత్ తో మనస్పర్థలు వచ్చిన కారణంగా దర్శకుడు క్రిష్ ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశాడనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. దర్శకురాలిగా కంగనా తన పేరు వేసుకుంటూ ఉండటం, ఈ వార్తకి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో సోనూ సూద్ కూడా తప్పుకున్నారని తెలుస్తోంది. ముందుగా చెప్పినట్టుగా కాకుండా తన పాత్రలో మార్పులు చేయడం పట్ల ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారట. అవతల నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోవడంతో, మరొకరితో ఆ పాత్రను పూర్తిచేయించుకోమని చెబుతూ, తాను తప్పుకుంటున్నట్టుగా తేల్చి చెప్పేశారట. ప్రస్తుతం ఆయన 'సింబా' షూటింగ్ పై దృష్టిపెట్టారని తెలుస్తోంది.   
kanganasonu

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more