'మోదీ హత్యకు కుట్ర' కేసు.. వరవరరావును ఇంటివద్ద వదిలేసిన పోలీసులు!
- హైదరాబాద్ కు తీసుకువచ్చిన అధికారులు
- పుణెలో మోదీ హత్యకు కుట్రపై లేఖలు లభ్యం
- మంగళవారం పౌరహక్కుల నేతల అరెస్ట్
ప్రధాని మోదీ హత్యకు మావోలు కుట్ర పన్నారనీ, దానికి వరవరరావు ఆర్థికసాయం చేస్తారన్నట్లు మహారాష్ట్రలో లేఖలు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం వరవరరావును అరెస్ట్ చేశారు. తాజాగా ఈ రోజు ఉదయం వరవరరావును హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ నగర్ లోని ఆయన ఇంట్లో వదిలిపెట్టారు.