భారత టెక్కీలకు మళ్లీ షాకిచ్చిన అమెరికా.. హెచ్1బీ ప్రీమియం వీసా సస్పెన్షన్!
- నిర్ణయం తీసుకున్న ఇమిగ్రేషన్ విభాగం
- ప్రీమియంతో కేవలం 15 రోజుల్లోనే వీసా
- ఇప్పుడు 6 నెలలు వెయిట్ చేయాల్సిందే
ప్రీమియం విధానం కారణంగా సాధారణ హెచ్1బీ వీసా దరఖాస్తులు భారీగా పెండింగ్ లో ఉండిపోతున్నాయని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్ సీఐఎస్) ఈ సందర్భంగా తెలిపింది. అందువల్లే ప్రీమియం దరఖాస్తులను మరో ఆరు నెలల పాటు నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో తొలుత ఆరు నెలల పాటు ప్రీమియం హెచ్1బీ దరఖాస్తులను నిలిపివేస్తూ యూఎస్ సీఐఎస్ నిర్ణయం తీసుకుంది. తాజాగా దాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఈ వీసాపై ఎక్కువగా భారతీయ ఐటీ నిపుణులు అమెరికాకు వెళుతుంటారు. తాజా నిర్ణయం నేపథ్యంలో భారత ఐటీ నిపుణులను కేవంల 15 రోజుల వ్యవధిలో అమెరికాకు తీసుకువెళ్లడం కుదరదు. దరఖాస్తు చేసిన 6 నెలల తర్వాతే అసలు వీసా మంజూరు అవుతుందా? లేదా? అన్నది తెలుస్తుంది.