హరికృష్ణకు ఇలా జరగడం చాలా దురదృష్టం: పవన్ కల్యాణ్

  • హరికృష్ణకు నివాళులర్పించిన ‘జనసేన’ అధినేత
  • ఇలా జరగడం చాలా దురదృష్టం
  • జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు సానుభూతి
నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం, మీడియాతో పవన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందడం చాలా దురదృష్టకరమని, చాలా బాధగా ఉందని చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంఘటనను మరిచిపోలేమని ఈ సందర్భంగా పవన్ గుర్తుచేశారు.
Go Back to Shorts
Pawan Kalyan

More Telugu News