విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌కు డీఎంకే, వీసీకే విజ్ఞప్తి
- మొదట విజయ్ సీఎంగా ప్రమాణం చేయడానికి ఆహ్వానించాలన్న పార్టీలు
- అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్న వీసీకే
- గవర్నర్ రాజ్యాంగ పరిధిలో వ్యవహరించాలని సీపీఐ డిమాండ్
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని, ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని సీపీఐ, వీసీకే పార్టీలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి. అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఆయనకు అవకాశం ఇవ్వాలని అన్నారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంలో జాప్యం జరుగుతోంది.
ఈ క్రమంలో వివిధ పార్టీలు స్పందించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కి అవకాశమివ్వాలని గవర్నర్‌ను కోరిన వీసీకే, ప్రభుత్వానికి సహకరించే అవకాశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీవీకేకు తొలుత అవకాశమివ్వాలని డీఎంకే కూడా స్పష్టం చేసింది.
గవర్నర్ రాజ్యాంగ పరిధిలోనే వ్యవహరించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదని, కానీ 108 స్థానాలు గెలుచుకున్న టీవీకేకు మొదట అవకాశమివ్వాలని పేర్కొంది. విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాలని కోరిన విషయాన్ని గుర్తుచేసింది.
విజయ్ ప్రమాణ స్వీకారం చేయకముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఒత్తిడి చేయడం సరికాదని అభిప్రాయపడింది. దీనిని సీపీఐ వ్యతిరేకిస్తోందని పేర్కొంది. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్‌కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని, ఆ తర్వాత సభలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు అవకాశమివ్వాలని కోరింది.
తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా టీవీకేను ప్రజలు ఎన్నుకున్నారని, అందువల్ల విజయ్‌కి మొదట అవకాశం ఇవ్వాలని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ అన్నారు. కానీ గవర్నర్ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గందరగోళానికి తావిస్తోంది అన్నారు. విజయ్‌ని ఆహ్వానించకపోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా రాజకీయ ఒత్తిడి తెస్తున్నారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతోందని తమిళనాడు యూత్ కాంగ్రెస్ మరో ప్రకటనలో పేర్కొంది. గవర్నర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అత్యధిక మెజారిటీ ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలని తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేను ఆహ్వానించకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని, గవర్నర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది.