Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు రాజకీయ జీవితం ఇచ్చిందే హరికృష్ణ!: కొడాలి నాని

  • ఆయనతో నాది 25 ఏళ్ల అనుబంధం
  • హరి మరణం వ్యక్తిగతంగా తీరని లోటు
  • మాట కోసం చాలాసార్లు నష్టపోయారన్న నాని
నందమూరి హరికృష్ణ మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత, జూ.ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని స్పందించారు. తనకు హరికృష్ణనే రాజకీయ జీవితాన్ని ఇచ్చారని నాని వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితం హరికృష్ణతోనే ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. హరికృష్ణతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని వెల్లడించారు.

హరికృష్ణ కారును చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారనీ, అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా నందమూరి హరికృష్ణ మృతి తనకు తీరని లోటని నాని అన్నారు. హరికృష్ణ భోళా శంకరుడనీ, ఎవరడిగినా వెంటనే సాయం చేసే వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేసుకున్నారు.

ఇచ్చిన మాటకోసం హరికృష్ణ చాలాసార్లు నష్టపోయారని కొడాలి నాని వెల్లడించారు. అలాంటి వ్యక్తి ఇలా అకస్మాత్తుగా చనిపోతారని తాను ఊహించలేకపోయానని నాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Kodali Nani
YSRCP

More Telugu News