‘అమర్ అక్బర్ ఆంటోని’ ఫస్ట్ లుక్ విడుదల.. మూడు షేడ్స్ లో అదరగొడుతున్న రవితేజ!
- విడుదల చేసిన రవితేజ
- హీరోయిన్ గా ఇలియానా
- దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు
రవితేజ మొత్తం మూడు విభిన్నమైన షేడ్స్ లో ఈ సినిమాలో కనిపించనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో దాన్ని కన్ఫామ్ చేస్తూ రవితేజ క్లాస్, మాస్, ఫన్నీ లుక్ లో మూడు పేక ముక్కల్లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దసరా పండుగ కానుకగా ఈ సినిమాలు విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.