Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ అవార్డును మరొకరి ద్వారా ఇప్పించుంటే తిరస్కరించేవాడిని!: 'సంతోషం' అవార్డుల వేడుకలో చిరంజీవి!

  • చిరంజీవికి 'సంతోషం' అవార్డు
  • అవార్డును అందించిన గానకోకిల ఎస్ జానకి
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
"నాకు అవార్డు ఇస్తానని అంటే వేడుకకు రాను. ఇవ్వబోనని చెబితేనే వస్తానని సురేశ్ కు ముందే చెప్పాను. కానీ, నన్ను మోసం చేసి, గానకోకిల ఎస్ జానకి చేతుల మీదుగా అవార్డు ఇప్పించి, నన్ను లాక్ చేశాడు. కాదనలేకపోతున్నా" అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. 16వ సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లో జరుగగా, చిరంజీవి మాట్లాడారు.

తొలిసారిగా జానకి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇదే అవార్డును మరొకరి చేతుల మీదుగా ఇప్పించుంటే సున్నితంగా తిరస్కరించేవాడినని చిరంజీవి చెప్పారు. గత ఐదేళ్లుగా ఈ సినిమా ఫంక్షన్ కు రావాలని సురేశ్ అడుగుతూ ఉంటే రాలేకపోయానని చెప్పిన జానకి, చిరంజీవి సినిమాల్లోని హిట్ సాంగ్స్ అన్నీ తనవేనని గుర్తు చేసుకున్నారు. ఆయన నటించిన 'ఖైదీ నంబర్ 150' చూశానని, పాత చిరంజీవిని చూసినట్టే ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Santosham
Chiranjeevi
Award
S Janaki

More Telugu News