రాజశేఖర్ కొత్త చిత్రానికి ‘కల్కి’ టైటిల్ ఖరారు.. మోషన్ పోస్టర్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజశేఖర్ కొత్త చిత్రానికి ‘కల్కి’ టైటిల్ ఖరారు.. మోషన్ పోస్టర్ విడుదల

  • రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా 
  • సంతోషంగా ఉందన్న రాజశేఖర్  
  • ఆకట్టుకున్న ‘కల్కి’ మోషన్ పోస్టర్
హీరో రాజశేఖర్ తాను నటిస్తున్న కొత్త చిత్రం ప్రీ లుక్ ను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. రక్షాబంధన్ సందర్భంగా ఈ చిత్రం గురించిన వివరాలను రాజశేఖర్ ఈ రోజు తెలిపారు. ఈ చిత్రానికి ‘కల్కి’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని రాజశేఖర్ పేర్కొన్నారు. ‘కల్కి’ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్న సందర్భంగా తమ చిత్ర యూనిట్, అద్భుత దర్శకుడు ప్రశాంత్ వర్మ, తాను ఎంతో హ్యాపీగా ఉన్నామని రాజశేఖర్ అన్నారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది.


rajashekar
kalki
motion poster

More Telugu News