Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన విజయ్ దేవరకొండ?

  • వరుస హిట్లతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ
  • యూత్ ఐకాన్ గా ఎదిగిన అర్జున్ రెడ్డి
  • రూ. 10 కోట్లకు రెమ్యునరేషన్ పెంచేసిన సెన్సేషనల్ స్టార్
వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి' సినిమాతో తన ఉనికిని చాటుకున్న విజయ్... ఇటీవల విడుదలైన 'గీత గోవిందం'తో స్టార్ హీరోగా అవతరించాడు. పైరసీ బారిన పడినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద 'గీత గోవిందం' చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. టాప్ హీరోల సినిమాలకు దీటుగా ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. మరోవైపు, యూత్ ఐకాన్ గా విజయ్ ఎదిగాడు. అతనికున్న ఫాలోయింగ్ సాటి యువ హీరోలకు కూడా అసూయను కలిగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఈ నేపథ్యంలో, విజయ్ తో సినిమాను తెరకెక్కించేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. తనకు డిమాండ్ భారీగా పెరగడంతో... విజయ్ కూడా రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశాడు. ప్రస్తుతం అతను రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్ టాక్. విజయ్ అడిగినంత ఇచ్చేందుకు కూడా నిర్మాతలు రెడీ అంటున్నారట.
vijay devarakonda
remunaration
tollywood

More Telugu News