పెళ్లి విషయంలో సుడిగాలి సుధీర్ కి ఆ మాట చెప్పాను: రష్మీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి విషయంలో సుడిగాలి సుధీర్ కి ఆ మాట చెప్పాను: రష్మీ

  • ఒక రియాలిటీ షో కోసం అలా చేశాము 
  • అదే నిజమని అంతా అనుకుంటున్నారు 
  • అందుకే సుధీర్ తో అలా అంటూ వుంటాను
రష్మీ ఒక వైపున బుల్లితెరపై సందడి చేస్తూనే .. మరో వైపున వెండితెరపై కథానాయికగా యూత్ మనసులను దోచేసుకుంటోంది. అలాంటి రష్మీ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "ఒక రియాలిటీ షో కోసం నేను .. సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం జరిగింది. కానీ బయట చాలా మంది నిజంగానే మా పెళ్లి జరిగిపోయిందని అనుకుంటున్నారు.

ఏదో ఒక రోజున నేను ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. అలాగే సుధీర్ కూడా తనకి నచ్చిన ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడుగానీ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడదు .. కాకపోతే అదెప్పుడు జరుగుతుందో తెలియదు. నేను ముందుగా పెళ్లి చేసుకుంటే సుధీర్ ని మోసం చేశానని చెప్పుకుంటారు. తను ముందు పెళ్లి చేసుకుంటే నాకు ద్రోహం చేశాడని అనుకుంటారు. అందువలన పక్క పక్కనే చెరో వేదికపై ఒకేసారి పెళ్లి చేసుకుందామని నేను సుధీర్ తో చెబుతూ వుంటాను" అని చెప్పుకొచ్చింది రష్మీ.         
rashmi

More Telugu News