Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుష్క కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు

  • మాధవన్ తో హేమంత్ మధుకర్ మూవీ 
  • విభిన్నమైన కథాకథనాలు
  • ఈ ఏడాది చివరిలో విడుదల     
ఈ మధ్య కాలంలో అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన 'భాగమతి' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అయినా ఆ తరువాత అనుష్క  మరే సినిమాకి సైన్ చేయలేదు. రెండు మూడు సినిమాలకి సంబంధించి ఆమె పేరు వినిపించినా, అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని తేలింది.

తాజాగా అనుష్క ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. హేమంత్ మధుకర్ తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మాధవన్ ను ఎంపిక చేసుకున్న ఆయన, తాజాగా అనుష్కను తీసుకున్నాడని అంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను, ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.     
anushka
madhavan

More Telugu News