చైనాలోని రిసార్ట్స్‌ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలోని రిసార్ట్స్‌ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి

  • హోటల్ నాలుగో అంతస్తులో మంటలు ప్రారంభం  
  • 16 మంది ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
  • తెల్లవారు జామున 4.30 గంటలకు ఘటన
చైనాలో ఈ రోజు ఉదయం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. హార్బిన్‌ నగరంలోని సన్‌ ఐల్యాండ్‌ రిసార్ట్స్‌ ప్రాంతంలోని బెయ్లాంగ్‌ హాట్‌ స్ప్రింగ్‌ హోటల్‌లో ఈ తెల్లవారు జామున (అక్కడి స్థానిక సమయం ) 4.30 గంటల సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

తొలుత నాలుగో అంతస్తులో ప్రారంభమైన మంటలు కాసేపటికి భవనం అంతటికీ వ్యాపించాయి. దీంతో 18 మంది సజీవ దహనం కాగా, 16 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. 30 అగ్నిమాపక శకటాలతో సుమారు వంద మంది సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.  
China
Fire Accident

More Telugu News