నేడు.. ఫ్లిప్ కార్ట్ లో డిస్కౌంట్ సేల్!
- పలు వస్తువులపై 10 నుంచి 80 శాతం రాయితీ
- హెచ్డీఎఫ్సీ కార్డుపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్
- నెలసరి వాయిదాలపై చెల్లింపునకు అవకాశం
టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్‌తో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ల్యాప్‌టాప్‌లు, ఆడియో వస్తువులు, కెమెరాలు, బ్లూటూత్ స్పీకర్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. ఇక ఫర్నిచర్, కిచెన్ వస్తువులపై 40 నుంచి 80 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. అలాగే, స్మార్ట్ టీవీలను ఆకట్టుకునే ధరలపై అందిస్తామంది. ఫ్లాష్ సేల్ పేరుతో గంటగంటకూ ఆఫర్లు ప్రకటిస్తోంది. మరో విషయం ఏమిటంటే, నెలసరి వాయిదాల పద్ధతి చెల్లింపు సౌకర్యం కూడా కల్పిస్తోంది.