Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకటేశ్ తో కలిసి నటించాలని వుంది: సీనియర్ హీరోయిన్ సితార

  • నా అభిమాన హీరో చిరంజీవి
  • ఆయనతో నటించడం అదృష్టం
  • ఎన్టీఆర్ .. మహేశ్ యాక్టింగ్ కూడా ఇష్టం
తెలుగు తెరకి కథానాయికగా 'మనసు మమత' సినిమా ద్వారా 'సితార' పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఆమె కథానాయికగా చేశారు. కుటుంబ కథా చిత్రాల్లో నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ మధ్య కాలంలో రీ ఎంట్రీ ఇచ్చిన సితార .. తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు.

తాజాగా 'వనిత టీవీ' ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "తెలుగులో నా అభిమాన కథానాయకుడు చిరంజీవి గారు. 'స్నేహం కోసం' సినిమాలో ఆయనతో కలిసి నటించాను. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తూ వుంటాను. ఇక ఎన్టీఆర్ .. మహేశ్ బాబుల నటన కూడా నాకు బాగా నచ్చుతుంది. రాబోయే రోజుల్లో వెంకటేశ్ తో కలిసి నటించాలని వుంది. ఆయన సినిమాల్లో ఫలానా రోల్ ఇస్తేనే చేస్తానని చెప్పలేను. వెంకటేశ్ మూవీలో మంచి పాత్ర ఏదైనా చేయాలని వుంది అని చెప్పుకొచ్చారు.             
sitara

More Telugu News