Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

35 ఏళ్లకు పెళ్లి చేసుకుంటా.. అమ్మాయి ఎవరైనా కావచ్చు!: విజయ్ దేవరకొండ

  • గతంలో 40 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నా
  • గీత గోవిందం ఎఫెక్ట్ దీనికి కారణం కావొచ్చు
  • చిత్రవిచిత్రమైన కోరికలేం లేవన్న విజయ్
గీత గోవిందం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. తొలుత తాను 40 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాననీ, ప్రస్తుతం దాన్ని 35కు తగ్గించానని చెప్పుకొచ్చాడు. గీత గోవిందం సినిమానే దీనికి కారణమా? అంటే కావొచ్చని ఈ యువ హీరో సమాధానమిచ్చాడు. తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ తన పెళ్లిపై మాట్లాడాడు.

తన మైండ్ సెట్ కు పెద్దలు కుదిర్చిన పెళ్లి అసలు సెట్ కాదని విజయ్ స్పష్టం చేశాడు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని అన్నాడు. ‘ఆమె తెలంగాణకు చెందిన అమ్మాయి కావొచ్చు.. కాకపోవచ్చు. ప్రపంచంలో ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ మేమిద్దరం కనెక్ట్ కావాలి. ఒకరినొకరు తెలుసుకోవాలి’ అని విజయ్ తన కలల రాణి గురించి చెప్పుకొచ్చాడు. గీత గోవిందం సినిమాలోని తన పాత్ర గోవిందం తరహాలో ప్రత్యేకమైన కోరికలు ఏవీ తనకు లేవని విజయ్ అన్నాడు.
geeta govindam
vijay devarakonda
marriage
Telangana

More Telugu News