చంద్రబాబు డైనమిక్ లీడర్!: రాందేవ్ బాబా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు డైనమిక్ లీడర్!: రాందేవ్ బాబా

  • చంద్రబాబు డైనమిక్ లీడర్
  • కొత్త రాష్ట్రం అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు
  • ఏపీలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి  
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, కొత్త రాష్ట్రమైన ఏపీ అభివృద్ధికి ఆయన బాగా కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీకి ప్రత్యేకహోదా హామీని ప్రధాని మోదీ నెరవేర్చాలని కోరారు. పతంజలి సంస్థ తరపున కేరళ వరద బాధితుల కోసం రూ.2 కోట్ల విలువ చేసే సరుకులు పంపినట్టు చెప్పారు. రాజకీయాల గురించి బాబా మాట్లాడుతూ, తాను క్రియాశీల రాజకీయాల్లో లేనని, 2019 ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని అన్నారు.

దేశంలో గో హింసను నిషేధించాలి

గోమూత్రం నుంచి పాల వరకు అన్నీ గోవు నుంచి పొందుతున్నామని, గోవును వధించడం మంచిది కాదని సూచించారు. దేశంలో గో హింసను నిషేధించాలని ప్రధాని మోదీకి రాందేవ్ బాబా విజ్ఞప్తి చేశారు.
Chandrababu
ramdev baba

More Telugu News