రికార్డు స్థాయిలో దూసుకుపోతోన్న 'సైరా' టీజర్
- ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు
- అభిమానుల్లో ఆనందోత్సాహాలు
- భారీ బడ్జెట్ తో రానున్న 'సైరా'
'సైరా' నుంచి వచ్చిన ఫస్టు టీజర్ కి అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ టీజర్ సూపర్బ్ గా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ టీజర్ అభిమానుల అంచనాలను అందుకునేలా .. వాళ్లకు సంతృప్తిని కలిగించేలా వుందని చెబుతున్నారు. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాంతో 'బాహుబలి' స్థాయి కథాకథనాలతో .. భారీతారాగణంతో .. సాంకేతిక విలువలతో ఈ సినిమా రానుందనే ఆసక్తితో అందరూ వున్నారు.