సిద్ధూ తల నరికి తెస్తే రూ.5 లక్షల నజరానా.. ప్రకటించిన భజరంగ్ దళ్ ఆగ్రా అధ్యక్షుడు సంజయ్
- పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడంపై విమర్శలు
- సొంత పార్టీ ముఖ్యమంత్రి నుంచి కూడా మద్దతు కరవు
- బీహార్‌లో రాజద్రోహం కేసు నమోదు
ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకున్నారు. సరిహద్దుల్లో మన సైనికుల చావులకు పాక్ కారణమవుతుంటే, మరోవైపు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను అంత ఆప్యాయంగా కౌగిలించుకోవడంపై పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. శివసేన అయితే, ఇదో సిగ్గుమాలిన చర్య అని మండిపడింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టులో సిద్ధూపై రాజద్రోహం కేసు నమోదైంది.