ఆసియా క్రీడల్లో నేలకొరిగిన జాతీయ జెండాలు!
- చైనా ఆసియా క్రీడల్లో దొర్లిన అపశ్రుతి
- పతకాల బహూకరణ సమయంలో నేలకొరిగిన జాతీయ జెండాలు
- అక్కడున్న వారంతా షాక్ కు గురైన వైనం
ఈ సందర్భంగా చైనా, జపాన్ లకు చెందిన జాతీయ పతాకాలను ఎగురవేశారు. చైనా గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో, ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో ప్రమాదవశాత్తు జెండాలు కిందకు పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత అధికారులు జెండాలను చేతులతో పట్టుకోగా... పతకాల బహూకరణ కార్యక్రమాన్ని ముగించారు. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది.