3 రోజుల్లో 10 కోట్లు రాబట్టేసిన నయనతార!

  • శుక్రవారం రిలీజైన 'కొలమావు కోకిల'
  • డ్రగ్స్ ను సప్లై చేసే పాత్రలో నయనతార 
  • త్వరలో తెలుగులోనూ విడుదల    
స్టార్ హీరోలతోనే కాదు .. యువ కథానాయకులతోను జోడీ కడుతూ నయనతార అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. సీనియర్ దర్శకులతోనే కాదు, కొత్త దర్శకులకి కూడా ఆమె ఎంతో ధైర్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటుంది. అలాగే కొత్త దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆమె 'కొలమావు కోకిల' చేసింది.

ఈ నెల 17వ తేదీన ఈ సినిమా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 10 కోట్ల రూపాయలను రాబట్టేసి, నయనతార సత్తాను మరోమారు చాటిచెప్పింది. కేన్సర్ తో బాధపడుతోన్న తల్లికి ట్రీట్మెంట్ చేయించడం కోసం డ్రగ్స్ మాఫియాలోకి దిగే పాత్రను నయనతార పోషించింది. డ్రగ్స్ ను సప్లయ్ చేసే పాత్రలో ఆమె నటన అద్భుతమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. 'కో కో కోకిల' అనే పేరుతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించనుంది.
Go Back to Shorts
nayanathara

More Telugu News