Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం: 'ఆటగాళ్లు' హీరోయిన్ దర్శన బానిక్

  • బెంగాలీ సినిమాలు చేశాను 
  • తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ 
  • అంజలి పాత్రలో కనిపిస్తాను
జగపతిబాబు .. నారా రోహిత్ ప్రధాన పాత్రధారులుగా, పరుచూరి మురళి దర్శకత్వంలో 'ఆటగాళ్లు' సినిమా రూపొందింది. ఈ సినిమాలో కథానాయికగా దర్శన బానిక్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదలవుతుండటంతో ఈ సందర్భంగా ఆమె మాట్లాడింది. "ఇంతవరకూ బెంగాలీ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన నాకు, 'ఆటగాళ్లు' తెలుగులో మొదటి సినిమా.

జగపతిబాబు .. నారా రోహిత్ ఇద్దరూ కూడా పోటీపడి నటించారు. ఈ సినిమాలో నేను హీరోను సిన్సియర్ గా ప్రేమించే 'అంజలి' పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. తెలుగులో 'బాహుబలి' .. 'ఆర్య' .. 'ధ్రువ' .. 'అరుంధతి' సినిమాలు చూశాను. 'బాహుబలి' సినిమా తరువాత నుంచి నేను ప్రభాస్ కి వీరాభిమానిగా మారిపోయాను. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బన్నీ స్టైల్ కూడా నాకు బాగా నచ్చుతుంది. ఈ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోను" అని చెప్పుకొచ్చింది.    
darshana

More Telugu News