నీ దగ్గరకు వచ్చేస్తానురా అంది అమ్మ.. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా?: చిరంజీవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీ దగ్గరకు వచ్చేస్తానురా అంది అమ్మ.. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా?: చిరంజీవి

  • మా ఇంటిని రేన్నోవేషన్ చేయించాం 
  • వారం, పది రోజుల కిందే అమ్మ నా వద్దకు వచ్చారు
  • ఒంటరిగా ఉండాలని అమ్మ అడిగినప్పుడు.. ఆమె నిర్ణయాన్ని గౌరవించాం
తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, నిరంతర కృషితో అత్యున్నత స్థానానికి చేరుకున్న డైనమిక్ హీరో. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు చిరంజీవి స్ఫూర్తితోనే ఎదిగారంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప వ్యక్తి చిరంజీవి కూడా ఓ అమ్మకు కొడుకే. ఆయనకు అమ్మంటే పంచ ప్రాణాలు. ఆ అమ్మ కూడా తన బిడ్డను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు.

ఇదే విషయాన్ని ఓ మీడియా సంస్థతో ఆయన పంచుకున్నారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మతో కలసి, చిరంజీవి సదరు మీడియాతో మాట్లాడారు. వారం, పది రోజుల కిందే అమ్మ తన వద్దకు వచ్చిందని ఆయన తెలిపారు. మేం ఉంటున్న ఇంటిని కొంచెం రెన్నోవేషన్ చేయిస్తున్నందున... దీంతో అమ్మ ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటోందని చెప్పారు.

ఈ మధ్య అమ్మ తనతో మాట్లాడుతూ, 'ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటోందిరా. నీ దగ్గరకు వచ్చేస్తా' అని చెప్పగానే తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. ఒంటరిగా ఉండాలని అమ్మ కోరుకున్నప్పుడు... ఆమె నిర్ణయాన్ని గౌరవించామని... ఇప్పుడు తానే 'వచ్చేస్తాను రా' అని చెబితే అంతకంటే ఆనందం ఏముంటుందని అన్నారు. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ తనకు ఏముంటుందని చెప్పారు. 
Chiranjeevi
birthday
mother
tollywood

More Telugu News