యాదగిరిగుట్టలో మళ్లీ మొదలైన వ్యభిచారం!
- గత మూడు వారాలుగా ఇళ్లకు తాళాలు వేసి పరారీ
- గుట్టకు తిరిగి వచ్చిన వ్యభిచార నిర్వాహకులు
- దాడులు చేసి ఏడుగురు బాలికలకు విముక్తినిచ్చిన పోలీసులు
ఈ విషయాన్ని గురించి ఉప్పందుకున్న పోలీసులు, నిన్న దాడులు చేసి మరో ఏడుగురు బాలికలను రక్షించి, పలువురిని అరెస్ట్ చేశారు. వీరంతా గత రెండు మూడు వారాలుగా ఇళ్లకు తాళాలు వేసి పారిపోయిన వారేనని, దాడులు ఆగాయని తెలుసుకుని వెనక్కు వచ్చారని పోలీసు అధికారులు వెల్లడించారు. కొంతమంది పోలీసు అధికారుల సహకారంతోనే వీరు తిరిగి వచ్చారని, దాడులు ఇకపై ఉండవని వారి నుంచి హామీ రావడంతో తమ దందాను తిరిగి మొదలు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, నిన్న పోలీసులు కాపాడిన ఏడుగురు అమ్మాయిలూ పదేళ్లలోపు వయసున్నవారే కావడం గమనార్హం. వీరిలో నాలుగేళ్ల పాప కూడా ఉంది.