కేటీఆర్ కు మంచి సలహా ఇవ్వాలని పవన్ ను కోరతా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేటీఆర్ కు మంచి సలహా ఇవ్వాలని పవన్ ను కోరతా: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

  • కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్ అంటారా?
  • పెద్దలను గౌరవించే సంప్రదాయం కేటీఆర్ కు లేదు
  • కావాలంటే కేటీఆర్ కే మా పార్టీ శిక్షణ ఇస్తుంది
కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలను మంత్రి కేటీఆర్ తన ట్వీట్ల ద్వారా విమర్శిస్తుండటంపై సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ శ్రేణులకు శిక్షణ ఇస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. పెద్దలను గౌరవించే సంప్రదాయం కేటీఆర్ కు ఏమాత్రం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్సే కేటీఆర్ కు శిక్షణ ఇస్తుందని, నాడు కేసీఆర్ కు శిక్షణ ఇచ్చి పెద్ద నేతను చేసింది తమ పార్టీయేనని అన్నారు. ఇటీవల రాహుల్ హైదరాబాద్ పర్యటనను విఫలం చేయడానికి యత్నించారని, ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లకుండా అనుమతి నిరాకరించారని ఆరోపించారు.

కేటీఆర్ కు నాయకత్వ లక్షాణాలున్నాయన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ని తాను స్వయంగా కలుస్తానని, కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ఆయనకు ఓ మంచి సలహా ఇవ్వాలని పవన్ ని కోరతానని వీహెచ్ అన్నారు. 
KTR
vh

More Telugu News