నిజాలు దాచను.. నా జీవితంలోని అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి: ఐశ్వర్య రాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిజాలు దాచను.. నా జీవితంలోని అన్ని కోణాలు ప్రజలకు తెలియాలి: ఐశ్వర్య రాయ్

  • బాలీవుడ్ లో మరో బయోపిక్
  • ఐశ్వర్య రాయ్ జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహకాలు
  • నా జీవిత చరిత్రను తెరకెక్కించాలని తాను కూడా కోరుకుంటున్నానన్న ఐష్


ప్రస్తుతం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమల్లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన 'సంజూ' ఇటీవలే విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్, వైయస్సార్ జీవితకథలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. కోలీవుడ్ లో జయలలిత, ఎంజీఆర్ ల బయోపిక్ లు తెరకెక్కబోతున్నాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో మరో బయోపిక్ తెరకెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నటి ఐశ్యర్య రాయ్ జీవితకథతో సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మధ్య తరగతి కుటుంబం నుంచి ప్రపంచ సుందరిగా, బాలీవుడ్ అగ్ర తారగా, అమితాబ్ కోడలుగా... ఇలా ఐశ్వర్య జీవితంలో ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు పలు వివాదాలు, హీరోలతో అఫైర్లు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ సినిమా తీస్తే... సూపర్ హిట్ కావడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఈ వార్తపై ఐష్ కూడా స్పందించింది. తన జీవిత చరిత్ర తెరకెక్కాలనే తాను కూడా కోరుకుంటున్నానని ఆమె తెలిపింది. తన జీవితంలో ఉన్న అన్ని కోణాలు ప్రజలకు తెలియాలని... ఏదీ దాచాలని తాను అనుకోవడం లేదని చెప్పింది. తన జీవితం ఒక గొప్ప కథ అవుతుందని తెలిపింది. 
Aishwarya Rai
biopic
bollywood

More Telugu News