ప్రభాస్ .. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం: జగపతిబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ .. ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం: జగపతిబాబు

  • హీరో అంటే చాలా బాధ్యత వుంటుంది 
  • నాకు ఇప్పుడు ఆ బాధ లేదు
  • అందరూ నన్ను చాలా గౌరవంగా చూస్తారు
జగపతిబాబు గురించి తెలిసినవాళ్లు .. దగ్గరగా చూసినవాళ్లు ఆయన చాలా నిజాయితీ పరుడు .. స్నేహశీలి అని చెబుతారు. నిజంగానే జగపతిబాబు చాలా మందికి ఆర్థికపరమైన సాయాలు చేసి నష్టపోయారు కూడా. ఆ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "హీరోగా అయితే సినిమా బాధ్యత అంతా నాపైనే వుంటుంది .. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు .. ఇలాగే బాగుంది.

నా తోటి నటీనటులు .. టెక్నీషియన్లు .. నిర్మాతలు అంతా కూడా నన్ను హీరోను చూసినట్లుగానే చూస్తుంటారు. నిజాయతీతో కూడిన ఆత్మీయతను కనబరిచేవాళ్లతో నేను ఎక్కువగా కనెక్ట్ అవుతాను. అలాంటివాళ్లలో ప్రభాస్ .. ఎన్టీఆర్ కనిపిస్తారు. ప్రభాస్ కి ఫోన్ చేస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు .. అందుబాటులో లేకపోతే ఆ తరువాత తప్పకుండా ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతాడు. ఇక ఎన్టీఆర్ కూడా అంతే అభిమానాన్ని కలిగి వుంటాడు. వాళ్లను నేను డిస్టర్బ్ చేయను .. కబురు చేస్తే ఇంటి దగ్గర కలుసుకుంటాను అంతే" అని చెప్పుకొచ్చారు.         
jagapathibabu

More Telugu News