ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ ల నిశ్చితార్థం.. ఫొటోలు
- ముంబైలో నిరాడంబరంగా ప్రియాంక, నిక్ ల ఎంగేజ్ మెంట్
- హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన నిశ్చితార్థం
- ఈ సాయంత్రం భారీ పార్టీ ఇవ్వనున్న జంట
పూర్తిగా హిందూ సంప్రదాయంలో.. ప్రియాంక, నిక్ ల తల్లిదండ్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ప్రియాంక కజిన్, సినీ నటి పరిణీతి చోప్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆమె.. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వచ్చింది. ఈ సాయంత్రం ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో వీరు ఎంగేజ్ మెంట్ పార్టీ ఇస్తున్నారు. ఈ పార్టీకి రణవీర్ సింగ్, కరణ్ జొహార్ లతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరవుతున్నారు.
